డ్యాంలో మృతదేహం లభ్యం

పాపన్నపేట, జూన్ 23 (జనంసాక్షి) : గుర్తు తెలియని సుమారు (55) సంవత్సరాల ఓ వృద్దురాలి మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఏడుపాయల చెక్ డ్యాంలో వృద్దురాలి మృతదేహం గమనించిన స్థానికులు పాపన్నపేట పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని వెలికి తీశారు. మృతురాలి ఆచూకీ కోసం పరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని,మృతురాలి దేహం పై బ్లూ కలర్ నైటీ తోపాటు,చెవులకు రేడిమెట్ కమ్మలు,ముక్కు పుడక ఉందని,మృతురాలి ఫోటో ఆధారంగా మృతురాలిని గుర్తించిన వారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ చరవాణి నెంబర్ 87126 57920,మెదక్ గ్రామీణ సీఐ కృష్ణమూర్తి 87126 57883 చరవాణి లకు సంప్రదించాలన్నారు.