అదుపుతప్పి డీసీఎం వాహనం బోల్తా – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

యాచారం, జూన్ 23(జనం సాక్షి )
యాచారం మండల కేంద్రంలో మంగళవారం ఒక రోడ్డు ప్రమాదం సంభవించింది. మాచర్ల నుండి పుచ్చకాయల లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మండల కేంద్రంలోని డీఎస్ఆర్ గార్డెన్ దాటగానే రోడ్డు పక్కన బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ఈ వాహనం అదుపు తప్పినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, వాహనాన్ని రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించారు.