ఇబ్రహీంపట్నంలో ఘనంగా 2K రన్ అవగాహన ర్యాలీ

ఇబ్రహీంపట్నం, జూన్ 23(జనం సాక్షి ) ప్రజల్లో సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆధ్వర్యంలో మంగళవారం భారీ 2K రన్ మరియు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్‌డీఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు ఉత్సాహంగా సాగింది.S.I.R అంశంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ర్యాలీలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం , అలాగే ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల తహసిల్దార్లు సంయుక్తంగా పాల్గొని సిబ్బందిని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సమాజ భాగస్వామ్యంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.