బాపుఘాట్‌ వద్ద కోదండరాం మౌనదీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంతదితర నేతలు బాపు ఘాట్‌ వద్ద గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే మౌనదీక్షను ప్రారంభించారు. తెలంగాణ కవాతు సంర్భంగా పోలీసు చర్యలను నిరసిస్తూ ఈ దీక్షను చేపట్టినట్లు కోదండరాం తెలియజేశారు. మధ్యాహ్నం  ఒంటిగంట వరకు దీక్ష కొనసాగనుంది.