బాబా రాందేవ్‌ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత కుట్ర

న్యూఢిల్లీ: భారత్‌ స్వాభిమాన్‌ మంచ్‌ కార్యకర్త రాజీవ్‌ దీక్షిత్‌ మృతి, తన గురువు శంకర్‌ దేవ్‌ అదృశ్యం కేసుల్లో తనను ఇరికించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు కుట్ర పన్నుతున్నారని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ఆరోపించారు. రాందేవ్‌ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజీవ్‌ దీక్షిత్‌ గుండె జబ్బుతో చనిపోయాడని చెప్పారు. ఈ విషయం అందరికీ తెలుసన్నారు. వంకర్‌దేవ్‌ అదృశ్యంతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న కాంగ్రెస్‌ నాయకుడిపై పోరాడుతానని ప్రకటించారు.