బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను ప్రశ్నించనున్న ఈడీ

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో నిందితుడైన యోగ గురు బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను త్వరలో ప్రశ్నించేందుకు ఎన్‌షోర్‌సమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సద్ధమవుతోంది. బాలకృష్ణ తన పాస్‌పోర్టుతో చేసిన విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులకు సంబంధించి విచారించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. రాందేవ్‌ నిర్వహిస్తున్న టెలివిజన్‌ ఛానల్‌, వేదిక్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు చెల్లింపులు, నిధుల ప్రవాహంపైనా సమీక్షను మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి అవకతవకలపై షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.