బాలికపై అత్యాచారం

కడప, జూలై 29 : కడప నగరంలోని ఆల్మాస్‌పేట యానాది కాలనీలో ఆదివారం 5 సంవత్సరాల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యానాది కాలనీలోని జయమ్మ పనిమనిషిగా జీవనం సాగిస్తుంది. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. అందులో చిన్నపాప వెంకటమ్మకు ఐదు సంవత్సరాలు, సమీప బంధువు నాగోలు (25)అనే యువకుడు తప్పతాగి చాక్లెట్లు ఇచ్చి సమీపంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి రావడంతో తల్లి విచారించింది. దీంతో ఆ బాలిక తల్లిని ముళ్ల పొదల వద్దకు తీసుకెళ్లి చూపించింది. అక్కడ తప్పతాగి పడి ఉన్న నాగోలును స్థానికులు చితకబాదారు. అనంతరం టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.