బాల్కోండ ఎమ్మెల్యేను కలిసిన ముస్లింలు

వేల్పూర్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : వేల్పూర్‌ మండలంలో అమినాపూర్‌ గ్రామంలోని ముస్లింలకు స్మశాణవాటిక, ఖబరస్తాన్‌్‌ కోరకు స్థలం కేటాయించాలని అమినాపూర్‌ ముస్లింలు 30 మంది కుటుంబ సబ్యులు ప్రభుత్వవిఫ్‌ చీఫ్‌ బాల్కోండ యంయల్‌ఏ ఈరవత్రి అనిల్‌ను కలువడం జరిగింది. తమ గ్రామంలో ఆసైన్‌మెంట్‌ ల్యాండ్‌ ఉందని యంయల్‌ఏకు తెలుపగా తహశీల్థార్‌కు వెంటనే స్థలం చూపించాలని అదేశించారు. యంఅర్వో విజయ్‌ కూమార్‌ సర్వే చేసి స్థలం ఇప్పిస్థానని హమి ఇచ్చారు. కాని ఇంతవరకు స్థలం చూపించుట లేదు ఇకనైన అదికారి స్పందించి మాచిరకాల కోరిక నేరవేరుస్తారని అనుకుంటున్నాం ముస్లిం సోదరులు తెలిపారు. ఈ కార్యాక్రమంలో మైనార్టి నాయ కులు చాంద్‌పాషా, రహిమ్‌,  హుస్సెన్‌, మౌలాన, కద్దు, తదితరులు పాల్గోన్నారు.