బిఆర్ఎస్ పార్టీ సైనికుల్లా పని చేయాలి – మంత్రి కొప్పుల.
.. బిఆర్ఎస్ పార్టీ సైనికుల్లా పని చేయాలి – మంత్రి కొప్పుల… జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తలు, ముఖ్యనేతలే పార్టీ కి పట్టుకొమ్మలని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విపక్షాలు చేసే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. ధర్మపురి మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ముఖ్యమంత్రి కెసిఆర్,ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది, ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబం ఈ కుటుంబానికి పెద్ద మన ముఖ్యమంత్రి కెసీఆర్, నాయకుల మధ్య కార్యకర్తల మధ్య ప్రభుత్వం మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడకు అందుతున్న విషయలపై, జరుగుతున్న అభివృద్ధి చర్చ జరగాలనే ఉద్యేశ్యం నిర్వహించడం జరుగుతున్నది.ఈ సమావేశాలు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి, పోలీస్ హోసింగ్ కమిటీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతున్నదని,బిఆర్ఎస్ పార్టీని బలోపేతం గ్రామ గ్రామాన కష్టపడుతున్న కార్యకర్తలకు, మహిళల సోదరీమణులకు, ప్రభుత్వం కోసం జవాబు దారిగా పనిచేస్తున్న నాయకుల కు ధన్యవాదాలు, తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలు కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందో చూశాం,ఈ యొక్క ప్రతిఫలాలు అందరికీ అందుతున్న సందర్భం, ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తల నాయకులు ప్రజలకు అందించే విషయంలో కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందించే విషయంలో మనం ఒక జవాబు దారిగా ఉండాలని ఉద్యేశ్యం నిర్వహిస్తున్నది ఈ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం…గ్రామాల్లో, మండలాల్లో, కావచ్చు పార్టీని ఒక క్రమ పద్ధతిలో గ్రామ శాఖలు, మండలం శాఖలు కావచ్చు, గొప్పగా చేయాలని, రానున్న ఎన్నికలకు సమయాత్తం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని,పార్టీ బలోపేతం పై ద్రుష్టి సారించాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి, విజయం సాధించాం, ఉద్యమ పార్టీకి ప్రజలు రెండు సార్లు అధికారం అప్పగించారని గుర్తు చేశారు, లక్షల మంది జై తెలంగాణ నినాదం తో రాష్ట్రం ఏర్పడిందని, పదవుల కోసం అవకాశాలు వస్తాయని, పార్టీ అభివృద్ధి కి పాటు పడాలని మంత్రి సూచించారు.తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కొప్పుల అన్నారు, ప్రతీ కార్యకర్తను కదిలిస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో వివరించాలన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. పార్టీ అనేది లింక్ లాంటిదాన్నారు. ఎమ్మెల్యే గెలిస్తేనే సర్పంచ్ గెలుస్తారు అని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాటలనే తాను చెబుతున్నానని అన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందాపు రామన్న, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సౌళ్ల భీమన్న, వైస్ యంపిపి మహిపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు కైసర్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మొగిలి శేకర్, పాల్గొన్నారు