బిగ్ బీ ట్వీట్ చూసి పోస్టర్‌ను తోలగించిన బీహార్ పోలీసులు
ముంబయి: అమితాబ్ బచ్చన్ పోస్టర్‌కే కాదు, ట్వీట్‌కి అంతకన్నా ఎక్కువ విలువే ఉంది. అందుకు నిదర్శన బీహార్ పోలీసుల స్పందన. బీహార్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో యువతను ఆ ప్రభావంలో పడకుండా చూడడానికి. వారికి స్ఫూర్తి కలిగించేందుకు ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం గురించి ప్రచారం కోసం ఏర్పాటుచేసిన పోస్టరులో యువతను ఆకట్టుకోవడానికి అమితాబ్ బచ్చన్ ఫోటోను వారు వాడుకున్నారు. తన అనుమతి లేకుండా ఫోటో వాడారని, తన న్యాయవాదులు తదుపరి కార్యక్రమం చేపట్టబోతున్నారని అమితాబ్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. దాంతో బీహార్ పోలీసులు వెంటనే ఆ పోస్టర్‌ను తోలగించారు. అనుమతి లేకుండా అమితాబ్ ఫోటో వాడురున్నందుకు క్షమాపణ చెప్పారు. ఫోటో వాడడంలో తమకు ఏ విధమైన దురుద్దేశం లేదని, కేవలం యువత త్వరగా ఆకర్షితులవుతారని మాత్రమే ఆ ఫోటో వాడామని వారు సంజాయిషీ చెప్పారు.