బిచ్కుంద సర్పంచ్ కు ఉత్తమ అవార్డు
బిచ్కుంద సర్పంచ్ కు ఉత్తమ అవార్డుబిచ్కుంద మార్చి 25 (జనంసాక్షి)
గ్రామపంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది. గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై ఆన్‌లైన్ ద్వారా వివరాలు పంపించగా పోస్టల్ ద్వారా పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పేరిట పురస్కారాలు ప్రశంసాపత్రాలను పంపించింది. ఈమేరకు శనివారం నాడు కలెక్టరేట్ లో వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీలు పురస్కారాలను అందుకున్నారు. ఇందులో భాగంగా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన గ్రామ ప్రథమ పౌరురాలు నూకల శ్రీరేఖ రాజుకు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిచ్కుంద ప్రజల సహకారంతో గ్రామానికి అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బిచ్కుంద వాసులు ఆమెను శుభాకాంక్షలు తెలిపారు.