బిసి కులగణన చేయాల్సిందే

అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కులగణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించింది. జనాభా గణనలో బీసీల కులగణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. 2021 జనాభా లెక్కలు చేయబోతున్నారు. ఇప్పటికే పలు అసెంబ్లీలు, పలు రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా కేంద్రానికి తీర్మానాలు పంపిస్తున్నాయి. బీసీ జనగణనపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని మన సభ్యులు కూడా చెప్పారు. మన రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా 50 శాతం వరకు ఉన్నారు. బీసీల్లో అణగారిన, పేద కులాలు అనేకం ఉన్నాయి. బీసీలకు అనేక రంగాల్లో న్యాయం జరగాలి. బీసీ కుల గణన చేయాలని తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ తీర్మాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.