బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో అపశృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. మల్లాయిగూడెంలో ప్రచార రథంపై రమేష్ (50) అనే బీఆర్ఎస్ నాయకుడు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే నేతలు స్పందించి రమేష్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ నేత మృతితో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. బీఆర్ఎస్ నాయకుడు మృతి పట్ల ఎమ్మెల్యే మెచ్చా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు.