బీఎస్పీ కార్యవర్గ సభ్యులతో మాయావతి సమావేశం రేపు

లక్నో: యూపీఏ ప్రభుత్వానికి మద్దతివ్వడంపై బీఎస్పీ కార్యవర్గ  సభ్యులతో మాయావతి రేపు భేటీ కానున్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏకు మద్దతు అంశంపై వారు చర్చించనున్నారు. కాన్షీరామ్‌ వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించిన  మాయావతి త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు.