బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది: మేనేజర్‌ మురళీధర్‌

హైదరాబాద్‌: బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇటీవల ప్రైవేటు ఆపరేటర్ల నుంచి గట్టి ఒత్తిడి ఎదురవుతోందని సంస్థ హైదరాబాద్‌ ప్రిన్నిపల్‌ జనరల్‌ మేనేజర్‌ మురళీధర్‌ అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్వవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు కార్యాచరణను ఆయన వివరించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 30 నుంచి 40 శాతం వాటా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లను నిలుపుకోనే ప్రయత్నంలో అన్ని స్కీములకు ప్రస్తుతం ఉన్న ధరతోనే 4ఎంబీ స్పీడు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ స్కీములపై నిర్వహించిన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన యువకులకు బ్లాక్‌బెర్రీ ఫోన్లు, డాటా కార్డులు అందించారు.