బీజేపీని గెలిపిస్తే.. 2014లో తెలంగాణ : సుష్మా

హన్మకొండ, జూన్‌ 9 (జనంసాక్షి ):
ఉప ఎన్నికల్లో బీజేపి గెలిపిస్తే వచ్చే 2014 లో తెలంగాణ  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని     ఆ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన బీజేపీ పోరుసభలో ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చే సత్తా తమ పార్టీకే ఉందన్నారు. గతంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామన్నారు. తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్‌లో ప్రైవేటు మెంబర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా బీజేపీదేనని సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. బిల్లు పెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి కావల్సి ఉన్నందున పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టలేకపోయామాన్నరు. డిసెంబర్‌ 9న యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ జన్మదినం కానుకగా చేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన పచ్చి అబద్ధమని తేలిపోయిందన్నారు. ఈ వర్షం సాక్షిగా, కాకతీయ కోట సాక్షిగా చెబుతున్నా తెలంగాణ ఇవ్వగిలేగి బీజేపీనే అని స్పష్టం చేశారు. తెలంగాణకు వందనాలు అర్పిస్తూ, ఇది ఇతిహాస ప్రాధాన్యతగల ప్రత్యేక సంస్కృతి అని సుష్మా పేర్కొన్నారు.