బీజేపీ బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌: నగరంలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. నగరంలో వ్యాపార వర్గాలు సంపూర్ణ బంద్‌ పాటించారు. బ్యాంక్‌లు, వాణిజ్య సంస్థలు, బంద్‌ పాటించాయి. నగర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరులు కొంత మంది కోర్టు అవరణలో ఉండటం చేత పోలీసులు అరెస్ట్‌ చేయలేక పోయారు. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ కొంత మంది కార్యకర్తలను గత రెండు రోజులనుండి సుమారు 1000మంది కార్యకర్తలను అరెస్ట్‌ చేసి గోప్యంగా ఉంచినట్లు తెలిసినాది.