బీజేవైఎం నేతల అరెస్టు
హైదరాబాద్: విద్యార్ధులకు ఫిజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ(బీజేవైఎం) డిమాండ్ వ్యక్తం చేసింది. ఫీజు రీయంబర్స్‌మెంట్ పై ప్రభుత్వం విధించిన షరతులకు నిరసనగ బీజేవైఎం ఈరోజు ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వైపు దూసుకెెళ్తున్న కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల పేద విద్యారక్ధులకు ఇంజినీరింగ్, వృత్తివిద్యా కోర్సులు దూరమవు తున్నాయన్నారు