బీపీ ఆచార్యకు చుక్కెదురు!

హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఓబులాపురం మైనింగ్‌ కేసులో మూడో నిందితుడైన బీపీ ఆచార్యకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ కోసం ఆచార్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను గురువారంనాడు తిరస్కరిం చింది. తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఐఎఎస్‌ అధికారి బీపీ ఆచార్య గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. వాదప్రతివాదనల అనంతరం తిరస్కరిస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది.