బీమా పథకంపై వ్యవసాయశాఖ సవిూక్ష
హైదరాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి): వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బాధిత రైతు కుటుంబానికి తక్షణమే సాయం అందేలా ప్రయత్నం చేయాలని జేసీ అన్నారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులకు, మండల వ్యవసాయ అధికారులకు రైతు బీమా క్లైయిమ్ విధానాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతు బీమా చేయించుకున్న రైతులు ఏదైనా కారణాల వల్ల మృతి చెందితే జీవిత బీమా నుంచి రైతు కుటుంబానికి సాయం అందుతుందన్నారు. ఎల్‌ఐసీ ద్వారా క్లైయిమ్ సంబంధిత రైతు కుటుంబానికి అందేవిధంగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి సేకరించాల్సిన పత్రాలు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా వ్యవసాయ అధికారి, సహాయ సంచాలకుల పాత్రను మాస్టర్ ట్రైనర్‌తో శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
—————



