బీమా పనులు పరిశీలించిన నీటిపారుదల శాఖ కార్యదర్శి

కొత్తకోట : మండలం తిరుమాయాపల్లి వద్ద జరుగుతున్న బీమా ఎత్తిపొతల పథకం మొదటి, రెండో దఖ పనులను నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యానాధ్‌దాస్‌ బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సీఈ ప్రకాష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్‌ చివరి నాటికి పనులు పూర్తి చేసి సన్నాహక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.