బుధవారం బోధన కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి
బుధవారం భోధన కార్యక్రమంలో బాగంగా వలిగొండ మండలం గోకారం గ్రామాన్ని  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, గొకారంలోని ప్రాథమిక పాఠశాల , హైస్కూల్ ను ఆకస్మికగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం భోధన కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి ప్రతి అధికారి తమకు సమీపంలో ఉన్న పాఠశాలను సందర్శించి పిల్లలతో బిగ్గరగా పాఠాలు చదివించి పిల్లలను ప్రోత్సహిస్తున్నారని, బిగ్గరగా చదవడం వల్ల పిల్లలలో జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందు ఉండటానికి దోహద పడుతుందని అన్నారు. ప్రైమరీ, ఉన్నత పాఠశాలల లోని ప్రతి క్లాస్ రూం లో పిల్లలను చదివించి వారిలో ఉత్సాహాన్ని పెంచారు. ప్రైమరీ , హైస్కూల్ చాలా బాగున్నాయని , పిల్లల చదువు కూడా సంతృప్తి కరంగా ఉందని, పాఠశాలలో పెద్ద పెద్ద చెట్లు ఉండటం పాఠశాల సిబ్బంది కృషికి నిదర్శనం అని కలెక్టర్ అన్నారు. ప్రైమరీ , హైస్కూల్ లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ యల్.గీత రెడ్డి, తహసీల్దార్  పి. శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీపీ యన్.రమేష్ రాజు, ఎస్ఎంసీ  చైర్మన్ యం లింగస్వామి, గ్రామ సర్పంచ్ టి.మాధవి, వార్డు మెంబర్లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.