బెంగళూరులో భారత్‌ విక్టరీ!

క్లీన్‌ స్వీప్‌ చేసిన ధోని గ్యాంగ్‌!
భారత తొలి ఇన్నింగ్స్‌.. 96.5 ఓవర్లలో..353/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌.. 63.2 ఓవర్లలో.. 262/5
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌.. 90.1 ఓవర్లలో.. 365/10
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌.. 73.2 ఓవర్లలో.. 248/10
బెంగళూరు, సెప్టెంబర్‌ 2 (ఎపిఇఎంఎస్‌): భారత ఆటగాళ్లు క్లీన్‌ స్వీప్‌ చేశారు. అందరి అంచనాలను నిజం చేశారు. సోమవారంనాడు తమ సత్తాను చాటుకున్నారు. కోహ్లీ, ధోని భాగస్వామ్యం పరుగుల వరద కురిపించింది. జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లారు. కోహ్లీ అర్ధ సెంచరీ సాధించగా ధోని 48 పరుగుల వద్ద విజయ లక్ష్యానికి చేరుకోవడంతో అర్ధసెంచరీకి ఒక అడుగు దూరంలో నిలిచిపోయాడు. 63.2 ఓవర్లలో 262 పరుగులు సాధించారు. 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. వరుణుడి ఆటంకపరిచినప్పటికీ తమ సత్తాను నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌ నిర్ధేశించిన 261 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు. హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఆగస్టు 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగిన తొలి టెస్టులో ఒక ఇన్నింగ్స్‌తో 150కి పైగా పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు స్థానిక చినస్వామి స్టేడియంలో ఆగస్టు 31వ తేదీన ప్రారంభమైన విషయం విదితమే.
భారత్‌ రెండో ఇన్సింగ్స్‌ ఇలా…
261 పరుగుల లక్షంతో సోమవారం ఉదయం బరిలోకి దిగిన భారత్‌ రెండవ ఇన్సింగ్స్‌లో 88 పరుగుల చేసి రెండు వికెట్లు కోల్పోయింది. గంభీర్‌ 34 పరుగుల వద్ద, సెహ్వాగ్‌ 35 పరుగుల వద్ద వికెట్లు కోల్పోయారు. పూజారా 48 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండవ ఇన్సింగ్‌లోనూ సచిన్‌ క్రికెట్‌ అభిమానులను నిరాశ పరిచారు. 27 పరుగుల వద్ద సౌధీ చేతికి చిక్కాడు. సురేష్‌ రైనా పరుగులు ఏమీ చేయకుండానే వికెట్టు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 51 పరుగులతోనూ, ధోని 48 పరుగులతోనూ నాటౌట్‌గా నిలిచారు.
న్యూజిలాండ్‌ బౌలర్లు ఇలా…
న్యూజిలాండ్‌ బౌలర్లు రెచ్చిపోయారు. భారత బ్యాట్స్‌మెన్ల దూకుడుకు కళ్ళెం వేసేందుకు యత్నించారు. జితేన్‌ పటేల్‌ 15.2 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే బౌల్ట్‌ 16 ఓవర్లు వేసి, 64 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీసుకున్నాడు. సౌధీ 18 ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రెస్‌వెల్‌ 14 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు.
రెండో ఇన్నింగ్స్‌లో పోరు ఇలా..
ఆదివారం సాయంత్రం ఆట ముగిసే సమయానికి రెండో టెస్టులో న్యూజిలాండ్‌ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. సోమవారం ఉదయం ఓవర్‌నైట్‌ స్కోరు ఆరంభించిన న్యూజిలాండ్‌ జట్టు మరో 16 పరుగులు మాత్రమే జోడించింది. భారత్‌ విజయ లక్ష్యాన్ని 261 (248+12) పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు దూకుడుగా తమ ఆటను ప్రారంభించారు. కివీస్‌ నిర్దేశించిన 261 పరగుల లక్ష్యాన్ని చేధించేందుకు సమాయత్తమయ్యారు. వరుణుడు కొద్దిసేపు అటకాయించినప్పటికీ భారత ఆటగాళ్లు తమ కృషిని కొనసాగించారు. పూజారా అర్ధ సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. కేవలం 2 పరుగుల దూరంలోనే తన వికెట్‌ను పటేల్‌ బౌలింగ్‌లో ఫ్లిన్‌కు సమర్పించుకున్నాడు. కోహ్లీ, ధోని భాగస్వామ్యం పరుగుల వరదను కురిపించింది.
రెండో టెస్టు తొలి, మలి ఇన్నింగ్స్‌లలో..
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ జట్టు 365 పరుగులు సాధించింది. భారత్‌ కంటే 12 పరుగుల ఆధిక్యతను సాధించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అంటే శనివారం, ఆదివారం ఉదయం జరిగిన ఆటలో 353 పరుగులకు ఆలౌటైన విషయం