బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను సీబీఐ సోమవారం ప్రశ్నించింది. ఏఎంఆర్‌కు మహా రాష్ట్రలోని బందేర్‌ బొగ్గు బ్లాక& కేటాయింపు వ్వవహారంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. గతంలో తనకు నాలుగు బొగ్గు బ్లాకుల కేటాయింపు జరిగిందన్న విషయాన్ని ఏఎంఆర్‌ దాచిపెట్టిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్వవహారంలో ఏఎంఆర్‌ మరో డైరెక్టర్‌ దేవేంద్ర (కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌దాద్రా తనయుడు)ను కూడా సీబీఐ ప్రశ్నించనుంది.