బోర్లం గ్రామాన్ని సందర్శించిన ప్రత్యేకధికారి

బాస్సువాడ: మండలంలో బోర్లం గ్రామాన్ని మండల ప్రత్యేకాధికారి వెంకటేశం సోమవారం సందర్శించి పలు సూచనలు చేశారు. గ్రామంలోని మురికి కాలువలను. పాఠశాలలను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలోని రిజిస్టర్‌లను స్టాకు నిల్వలను పరిశీలించారు. విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించాలని వసతి గృహ అధికారిణికి సూచించారు. ఆయన వెంటే గ్రామాధికారి కిషన్‌, విఆర్వోలున్నాయి.