బ్రాహ్మణికి నీటి కేటాయింపుల జీవో రద్దు.

హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి):
బ్రాహ్మణి స్టీల్స్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం తాజాగా ఆ కంపెనీకి నీటిని కేటాయిస్తూ జారీ చేసిన ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. బుధవారంనాడు వీటికి సంబంధించిన జీఓలను రద్దు చేసింది. కడప జిల్లా జమ్మలమడుగులో బ్రాహ్మణి స్టీల్స్‌కు ఇచ్చిన నీటి కేటాయింపులను నీటి పారుదల శాఖ రద్దు చేసింది. జమ్మలమడుగులో ఏర్పా టు చేయతల పెట్టిన బ్రాహ్మణి స్టీల్స్‌కు రెండు టీఎంసిల నీటిని గండికోట రిజర్వాయర్‌ నుంచి కేటాయించారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు శాసన సభలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఒప్పందంలోని అంశాల ప్రకారం ప్రాజెక్టు రూపుదిద్దుకో నందున ఈ నీటి కేటాయింపులన్నీ రద్దు చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2007లో జారీ చేసిన జీవో నంబర్లు 162, 761, 2008లో జారీ చేసిన జీవో నెంబర్‌ 84లను రద్దు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.