బ్రిటన్ల్ఓ కనర్జ్వేటివ్ పార్టీ ఎంపి దారుణహత్య
ప్రజలతో సమావేశం సందర్బంగా కత్తితో దాడి
లండన్,అక్టోబర్16(జనంసాక్షి ): బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమెస్ దారుణ హత్యకు గుర్యాª`యారు. ఆయపపై శుక్రవారం కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పు ఇంగ్లాండ్?లోని ఓ చర్చ్?లో నియోజకవర్గం ప్రజలతో అమెస్? భేటీ అయిన సమయంలోనే ఆయనపై ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు అమెస్‌ను పలుమార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి ఎయిర్? అంబులెన్స్?ను పంపించారు. హూటాహూటిన అమెస్‌ను చికిత్స కోసం సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన శరీరంపై అనేక కత్తిపోట్లు ఉండటం, అప్పటికే చాలా రక్తం పోవడంతో చనిపోయారు. ఈ ఘటనలో పాతికేళ్ల ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అవిూస్ హత్యను బ్రిటన్ పోలీసులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. 69 ఏళ్ల అమెస్? 1983 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఎసెక్స్‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి అవిూస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత అయిన డేవిడ్ అవిూస్ ఇలా దారుణ హత్యకు గురికావడం బ్రిటన్ నేతలను షాక్‌కు గురి చేసింది. ఆయన మృతిపై బ్రిటన్? రాజకీయ నేతలు తీవ్ర దిగ్భాంª`రతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక 2016 జూన్?లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. లేబర్పార్టీకి చెందిన జో కాక్స్ అనే నేతను ఉత్తర
ఇంగ్లాండ్?లోని ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన కత్తిదాడి?లోనే చనిపోయారు. బ్రిటన్? చట్టసభ్యులకు పార్లమెంట్?లో పూర్తిస్థాయి రక్షణ ఉంటుంది. కానీ నియోజకవర్గాల్లో మాత్రం వారికి ఎటువంటి భద్రత ఉండదని సమాచారం. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడి రాజకీయ నేతలు వాపోతున్నారు.