భవానాన్ని ఢీకొన్న విమానం ఇద్దరు ఫైలట్ల దుర్మరణం

జకార్తా: ఇండోనేసియా వైమానికి ప్రదర్శనలో శనివరాం చేపట్టిన విన్యాసాల్లో తేలికపాటి విమానం ఒకటి భవంతిని ఢీకొని పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఫైలట్లు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారని రవాణా మంత్రిత్వశాక ఓ ప్రకటనలో తెలిపింది. సెస్నా 202 విమానం ఉదయం 11.37 గంటల సమయంలో విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పి భవంతిని ఢీకొంది. విమానంలోని ఇద్దరు ఫైటట్లు మరణించారు. అని రవాణా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బాంబాంగ్‌ ఎర్వాన్‌ విలేకరులకు తెలిపారు. గతంలో కూడా ఆ దేశంలో అనేక విమాన ప్రమాదాలు జరిగాయి.