భారతీయ మార్కెట్లపై దృష్టి సారించిన టైగర్ ఇండియా

ఖైరతాబాద్ : సెప్టెంబర్ 22 (జనం సాక్షి)  జపాన్ దేశానికి చెందిన టైగర్ కార్పొరేషన్ వారి అనుబంధ సంస్థ టైగర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీఐపీ ఎల్)ఈ వసంతకాలంలో ప్రారంభించిన కొత్త ఉత్పత్తుల అమ్మకాలు బాగా జరుగుతున్నందుకు భారతీయ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపింది. కమీచిడో అనే క్యోటోలోని ఒక జపాన్ కళతో రూపొందించిన ప్రత్యేకమైన జంతువుల పెయింటింగులతో కూడిన ఎంసీటీ చిన్న పిల్లలున్న తల్లులు, యువతలను బాగా ఆకట్టుకుంది. దాని శాశ్వత స్టెయిన్ లెస్ – స్టీల్ స్ట్రాతో ఎంసిఎస్ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే పర్యావరణ స్నేహపూర్వక ఉత్పత్తిగా ఆదరణ పొందుతోంది. టైగర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(టీఐపీఎల్) ప్రతినిధి మసాపుమి యమమోటో మాట్లాడుతూ తమ వాక్యూమ్ ఇన్సులేటెడ్ బాటిల్స్ ను ప్రోత్సహించడం ద్వారా మేము మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో ప్లాస్టిక్ కంటైనర్లు, పెట్ బాటిళ్ల సంఖ్యను తగ్గించగలమని, తద్వారా భారతదేశంలో ఉన్న పర్యావరణ సమస్యలకు దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు. టైగర్ కార్పొరేషన్ వచ్చే ఏడాది తన వందో వార్షికోత్సవాన్ని చేసుకుంటోందన్నారు. నాణ్యత – స్పృహ కలిగిన జపనీస్ మార్కెట్లో మేము కొన్నేళ్లుగా అభివృద్ధి చేసిన వాక్యూమ్ ఇన్సులేషన్ ద్వారా ధర్మల్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా టైగర్ డూ హాట్ డూ కూల్ ‘ ప్రకటనను భారత మార్కెట్లోకి తీసుకొస్తోందన్నారు.