భారతీయ వాయుసేనలోకి 31 మంది మహిళలు
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ శనివారం ఒక చరిత్రాత్మక ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. అక్కడ పైలట్ శిక్షణ ముగించుకుని వాయుసేనలో చేరిన 221 మందిలో ఈ సారి 31 మంది మహిళలు ఉన్నారు. వారి పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నౌకాదళాధిపతి అడ్మిరల్ డీకే జోషి లాంఛనంగా ఈ అభ్యర్థులను వాయుసేనలో చేర్చుకున్నారు. వాయుసేన లాంటి ప్రతిష్ఠాత్మక విభాగంలో చేరి తమ బిడ్డలు దేశానికి సేవలందించబోతున్నందుకు వారి తల్లిదండ్రులు గర్వంతో పొంగిపోయారు. ఈ 31 మంది మహిళా అభ్యర్థుల్లో మయూరి చోప్రా రాష్ట్రపతి పతకం గెలుచుకున్నారు.