భారత్‌ సంపన్నులలో అగ్రస్థానం ముఖేష్‌

లక్ష్మీ మిట్టల్‌ ద్వితీయం, 73వ స్థానంలో విజయ్‌మాల్య

న్యూయార్క్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి):

ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తన స్థానాన్ని పదిలపరు చుకున్నారు. ఫోర్బ్స్‌ వెల్లడించిన జాబితాలో ముఖేశ్‌ చోటు సంపాదించడం ఇది ఐదవసారి. తన ఆస్తుల విలువలో 1.6 బిలియన్‌ డాలర్లు క్షీణించినప్పటికీ… ముఖేశ్‌ అగ్రస్థానానికి ముప్పేమి కలుగలేదు.  16,000 బిలియన్‌ డాలర్లతో లక్ష్మిమిట్టల్‌ రెండవ స్థానంలో నిలిచారు. వందమందితో కూడిన భారతీయ సంపన్నుల జాబి తాను ఫోర్బ్స్‌ గురువారం

వెల్లడిం చింది.

బిలియన్‌ డాలర్లలో…

12,200 అజిమ్‌ ప్రేమ్‌జీ మూడోస్థానం, 9,800 పల్లోంజి మిస్ట్రీ నాల్గొస్థానం, 9,200 దిలీప్‌ సంఘ్వీ ఐదోస్థానం, 9,000 ఆది గాద్రెజ్‌ అండ్‌ ఫ్యామిలీ ఆరోస్థానం, 8,200 సావిత్రి జిందాల్‌ అండ్‌ ఫ్యామిలి ఏడో స్థానం, 8,100 శశి అండ్‌ రుజ ఎనిమిదో స్థానం, 8,000 హిందూజా బ్రదర్స్‌ తొమ్మిదో స్థానం, కుమార్‌ బిర్లా 7,800 పదో స్థానం
కాగా, కింగ్‌ఫిషర్‌ విమానయాన సంస్థ అధినేత విజయమాల్యా స్థానం దిగిపోయింది. కింగ్‌ఫషర్‌ విమానయాన సంస్థ ప్రభావం ఆయనపై బాగానే చూపింది. విజయ్‌ మాల్వా నికరాస్తుల విలువ బిలియన్‌ డాలర్ల కన్నా తక్కువకు పడిపోవడంతో ఈ రోజు విడుదలైన పోర్బ్స్‌ పట్టికలో ఆయన స్థానం 49 నుంచి 73కు పడిపోయింది. మాల్యా ఆస్తుల విలువ 800 బిలియన్లు పోర్బ్స్‌ పేర్కొంది.