అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

తుంగతుర్తి డిసెంబర్ 19 (జనం సాక్షి)
ప్రమాణ స్వీకారం చేయకముందే అభివృద్ధి పనులు ప్రారంభం
నూతన సర్పంచ్.
కుంచాల శ్రీనివాస్ రెడ్డి
సర్పంచ్ ఎన్నికల ముందు ప్రజలు ఆశీర్వదించి తనని గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తాను గ్రామ ప్రజలకు మాట ఇచ్చానని దాన్ని నెరవేర్చేందుకు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మండల పరిధిలోని అన్నారం గ్రామ నూతన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు, శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ
తాను నూతనంగా ఎన్నికై సర్పంచ్ ప్రమాణస్వీకారం చేయకముందే ప్రజలకు వాగ్దానం చేసిన మేరకు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టానని అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు, గ్రామ పంచాయతీకి నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని అంతవరకు ప్రజలు ఇబ్బందులు పడవ వద్దని ఉద్దేశంతో తన సొంత నిధులను వెచ్చించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు, తాను గత 25 సంవత్సరాలు పైగా వేతనంతో సంబంధం లేకుండా గోపాల మిత్రలో పనిచేస్తూ గ్రామంలో ఉన్న మూగజీవాలకు సేవ చేశానని అన్నారు. గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్ గా ఎన్నుకున్నారని తాను నాయకునిగా కాక గ్రామ ప్రజలకు సేవకుడిగా పనిచేసి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం తన సొంత నిధులతో తన గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను జెసిబి లతో తొలగించే రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టానని అన్నారు, గ్రామంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని గ్రామ పంచాయతీకి నిధులు వచ్చిన రాకున్నా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు, గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించారని అందుకు తాను గ్రామ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు, అన్నారం క్రాస్ రోడ్డు నుండి గ్రామానికి వచ్చే రహదారి పూర్తిగా కంపచెట్లతో కూడుకొని ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తాను ఎన్నిక కాగానే తన సొంత నిధులతో మూడు కిలోమీటర్లు అన్నారం క్రాస్ రోడ్డు నుండి గ్రామం వరకు ఉన్న కంపచెట్లు తొలగించాలని సంకల్పించానని అన్నారు సందర్భంగా సర్పంచ్ చేపట్టిన పనులపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిత మరియు వార్డు సభ్యులు బింగి వెంకటేశ్వర్లు , సుకన్య ,జానకమ్మ, శ్యామ్ ,ఉమా, ప్రవీణ్, లావణ్య, సోమయ్య, చిరంజీవి గ్రామ ముఖ్యులు మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మట్టపెల్లి వెంకట్, తన్నీరు యాదగిరి, గ్రామ మాజీ సర్పంచ్ చిత్తలూరి సోమశేఖర్ పోతరాజు, రాములు, నరేష్ ,సతీష్, మహేష్, కృష్ణ, రాయుడు ,రాయుడు ,వీరయ్య , శ్రీకాంత్, గణేష్, రాజు ,సోమయ్య తదితరులు పాల్గొన్నారు



