భారీగా ఎచ్రందనం దుంగలు పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపాలెం సమీపంలో స్వర్ణముఖి వాగులో పాతి పెట్టిన సుమారు 100కు పైగా ఎర్రచందనం దుంగలను స్పెషల్‌ బ్రాంచి పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. కోటిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. శేషాచలవ అడవుల నుంచి తమిళనాడుకు తరలించేందుకు స్మగ్లర్లు వీటిని సిద్ధం చేసినట్లు చెప్పారు. తిరుపతి అర్బన్‌ఎస్పీ ప్రభాకర్‌రావు  అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలియజేశారు.