భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 25 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.