భారీగా పోలీసుల మోహరింపు

హుజురాబాద్‌ మే 27 (జనంసాక్షి):
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని గత మూడు రోజులనుండి సిబిఐ అధికారులు విచారిస్తుండగా ముందస్తుగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆదివారం హుజురాబాద్‌ సిఐ శ్రీనివాస్‌ ఆద్వర్యంలో పోలీసులు పికటింగ్‌లు ఏర్పాటుచేశారు. వైసిపి విబాగ జిల్లా అద్యక్షుడు సందమల్ల నరేష్‌, మోరె మధు, జంగం అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.