భారీ వర్షానికి తడిసిన వరి దాన్యం

చిలప్ చేడ్/నవంబర్/జనంసాక్షి :- మండలంలో కురిసిన భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యంకుప్పలు మండలంలో కురిసిన వర్షానికి చిలప్ చేడ్ చండూర్ చిట్కుల్ గౌతపూర్ ఫైజబాద్ బండపొత్గల్ అజ్జమర్రి గంగారం గ్రామంలోన్ని రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికొచ్చిందని అనుకున్న రైతుకి నోటికాడి బుక్క లాగేసిన్నట్టు వరుణుడు కరుణిచ్చాక
దాదాపు గంటన్నర వరకు భారీ వర్షం పడి రైతులకు చాలా నష్టం జరిగింది కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది ఈ వర్షం వల్ల రైతుల నష్టపోకుండా ఉండేవిధంగా ప్రభుత్వమే రైతన్నలను ఆదుకొని అండగా నిలవాలని గ్రామాలలోని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వ అధికారులు రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులకు
కలిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా వారికి తగిన సహాయాన్ని అందజేయాలని వారు అధికారులను కోరడం జరిగింది