భోజన విరామానికి భారత్ 146/4
నాగ్‌పూర్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజున భారత్ నిలకడగా ఆడుతోంది. 4 వికెట్ల నష్టానికి 87 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు ఆటను ప్రారంభించిన టీంఇండియా భోజన విరామ సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 146 పరుగులు చేసింది. కోహ్లీ 46, ధోనీ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది.