మంత్రి ధర్మాన రాజీనామా అంశం నా చేతిలో లేదు

హైదరాభాద్‌: మంత్రి ధర్మాన రాజీనామా అంశం తన చేతిలో లేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. రాజీనామా ఆమోదంపై నిర్ణయం తన పరిధిలో ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తమని అన్నారు. రాజీనామా ఆమోదించమని సీఎం పంపిస్తే ఆమోదిస్తానని తెలిపారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, బంతి తన కోర్టులో లేదన్నారు.