మంత్రులకు న్యాయసహాయంపై హైకోర్టులో ప్రైవేటు పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసహాయంపై హైకోర్టులో ప్రైవేటు పిటిషన్‌ను  దాఖలైంది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయసహాయాన్ని ప్రశ్నిస్తూ ఓఎం దుబేరా అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్యలకు న్యాయం సహాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది.