మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌, మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్త మంత్రుల నివాసాల ముట్టడికీ ఏబీవీపీ యత్నించింది. పెద్దసంఖ్యలో మంత్రుల నివాస ప్రాంగణానికి చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటుచేసుకుంది. ప్రైవేటు యాజమాన్యాలకు సహకరించే ఉద్దేశంతోనే యాజమాన్య కోటా సీట్లను లక్షలకు అమ్ముకునే విధంగా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.