మందకృష్ణ స్వార్థంతోనే వర్గీకరణకు ముప్పు

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగిలను మోసం చేయడానికి మందకృష్ణ ఒడిగట్టారని ఎమ్మార్పీఎస్‌ జిల్లా  నాయకులు ఆరోపించారు.  మాదిగలను మోసంచేయడానికి మందకృష్ణ ఇతర రాజకీయపార్టీలతో కలసిపోయారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ రూపుదాల్చకుండా మాదిగలను ఎస్సీ వర్గీకరణకు దూరం చేస్తున్నారన్నారు. మాదిగలపై మందకృష్ణకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. తన స్వలాభం కోసం కావాలనే వర్గీకరణ సాగదీస్తూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 12యేళ్లు కేసీఆర్‌ పోరాటాలుచేసి తెలంగాణ సాధిస్తే, గత 20యేళ్లు వర్గీకరణ సాధన కోసం నిరంతరం పోరాటాలు చేసి యువకులు, విద్యార్థులు అశువులు బాసినా ఏమాత్రం ఫలితం దక్కలేదన్నారు.  ఉద్యమాలను నీరు గార్చేదిశగా తన స్వార్థం కోసం మందకృష్ణ మాదిగలను మోసం చేస్తున్నారన్నారు. ఆయన చర్యలను ఇకముందు సహించబోమని హెచ్చరించారు.