మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం
మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం
జుక్కల్, నవంబర్ 25,( జనంసాక్షి),
మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని జుక్కల్ మండల పరిషత్ వైస్ చైర్మన్ ఉమాకాంత్ కులకర్ణి ఆన్నారు. ఆయన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలములోని కౌలాస్ నాల ప్రాజెక్ట్ లో రొయ్య పిల్లల విడుదల సందర్బంగా మాట్లాడారు.ప్రతి సంవత్సరం తెలంగాణా ప్రభుత్వం చేపపిల్లలను, రొయ్యలను రాయితీ పై అందజేసి చెరువుల్లో, ప్రాజెక్టులో విడుదల చేస్తోందని తెలిపారు. మత్స్యకారులకు చేపలు, రొయ్యలు అమ్మడానికి గాను ప్రభుత్వం ద్విచక్ర వాహనాలను అందజేసిందని తెలిపారు. ప్రస్తుతం కౌలాస్ ప్రాజెక్ట్ లో మత్స్య శాఖ అధ్వర్యంలో 498450రాయితీ రొయ్య పిల్లలను విడుదల చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ సింగిల్ విండో అద్యక్షులు నాగల్ గిద్దె శివానంద్, స్ధానిక సర్పంచ్ కిషన్ పవార్, జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, ప్రత్యేక అధికారి శివ ప్రసాద్,ఎఫ్డీవో డోల్ సింగ్, ఎఫ్ ఎఫ్ ఏ జైరాం, సురేష్,తెరాస సీనియర్ నాయకులు నీలుపాటిల్, శంకర్ పటేల్, దిలీప్, మత్స్య కారులు, గ్రామస్థులు పాల్గో న్నారు.