మద్దికుంట గ్రామంలో రూ.2,50 లక్షలతో అభివద్ధి పనులు
నిజామాబాద్,ఆగస్టు17(జనంసాక్షి): మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ బండ పరిధిలోని 10 వార్డులో మండల పరిషత్ నిధుల నుంచి రూ.2,50 లక్షలతో మంగళవారం అభివద్ధి పనులు ప్రారంభం
అయ్యాయి. గ్రామ 10వ వార్డు లో డ్రైనేజి, కల్వర్టు పనులను రామారెడ్డి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు నారెడ్డి దశరథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామిరెడ్డి, ఉప సర్పంచ్ కమిల్ల నరేంధర్, వైస్ ఎంపీపీ రవీందర్ రావు, ఎంపీటీసీ గజ్జెల రాజేందర్, వార్డు మెంబెర్లు కమిల్ల చిన్నస్వామి,
తోట రమేష్, బొమ్మేడి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.