మధిరలో రాస్తారోకో

మధిర: విద్యుత్‌కోతను నిరసిస్తూ శుక్రవారం మధిరలో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి కోత విధించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మేల్మే ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్కకు ప్రజల సమస్యలుపట్టకపోవటం సిగ్గుచేటన్నారు. రాస్తారోకో రెండుగంటలపాటు జరగటంతో ట్రాఫిక్‌ పెద్దఎత్తున నిలిచిపోయింది.