మధ్యాహ్నం 2 గంటలకు సబితాతో భేటీకానున్న ఓయూ జేఏసీ

హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఓయూ జేఏసీ భేటీ కానుంది. ఓయూలో అదనపు బలగాలను వెనక్కి రప్పించాలని, తమను మార్చ్‌కు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఓయూలో పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు వడ్డెరబస్తీలో విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు.