మరో మూడు రోజుల పాటు గోయల్‌ కందాకు రిమాండ్‌

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయాల్‌ కందాకు ఢిల్లీ కోర్టు మరో మూడు రోజుల పాటు రిమాండ్‌ పొడిగించింది. గతంలో ఢిల్లీ పోలీసుల కోరిక మేరకు పొడిగించిన ఏడు రోజుల రిమాండ్‌ నేటి ముగిసింది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైన కందాకు మరో మూడు రోజుల రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.