మల్కాజిగిరిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.

మల్కాజిగిరిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.మల్కాజిగిరి. జనం సాక్షి.ఏప్రిల్ 1
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందే విధంగా ప్రతి నాయకుడు,కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు.శనివారం మల్కాజిగిరి లోని లక్ష్మీ సాయి గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మైనంపల్లి అధ్యక్షతన జరిగింది.ఈకార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శంభీపూర్ రాజు,ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు గర్వపడేలా కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని,ఇంకా చేయాల్సి ఉందని అన్నారు.కార్పొరేటర్లు కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పక్కా ప్రణాళికతో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని ఆన్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని పార్టీని నమ్ముకుని పని చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నాయకులు కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధా లను బలోపేతం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.