మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు

శ్రీకాకుళం, జూలై 23 : పెట్రోల్‌ ధల తగ్గుతూ.. పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికి అయిదుసార్లు ఈ విధంగా పెరుగుతూ, తగ్గుతూ.. మళ్లీ పెరుగుతూ వచ్చింది. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు లీటరు పెట్రోలు ధర 74.09గా ఉంది. రాత్రికి రాత్రే చమురు కంపెనీలు రూ. 70 పైసలు పెంచింది. దీంతో స్థానిక పన్నులు కలుపుకొని అది కాస్తా 80 నుంచి 85 పైసలు దాకా జిల్లా ప్రజపై అదనపు భారం పడినట్లయింది. జిల్లాలో మొత్తం 83 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటి పరిధిలో 75 వేల లీటర్ల పెట్రోల్‌ రోజుకు వినియోగమవుతోంది. ఈ లెక్కన జిల్లా వాసులపై రోజుకు సుమారు రూ. 65 వేలు, నెలకు రూ. 20 లక్షల వరకు భారం పడుతుంది.