మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ అన్నారు.గురువారం మండల కేంద్రంలో శ్రీశక్తి భవనానికి శంకు స్థాపన గావించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నేడు పురుషులతో పాటుగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహి ళలు అక్షరాస్యులైతే వారి కుటుంభంతో పాటుగా దేశం కూడా బాగు పడుతుందని,అందరూ మహి ళలు చదువుకొని ముందుకురావాలని ఆకాంక్షిం చారు. చదువుకున్న మహిళ అన్నింటా ముందుం టుందని ప్రతి ఒక్కరు చదువుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస రావు, ఎంపీడీఓ సంజీవరావు, ఏఓ రా ములు, కరెంటు ఏఈ సదాశివరెడ్డి, మురళి, కార్యదర్శు లు, మాజీ సర్పంచ్‌ న్యారబోయిన గంగాధర్‌, లక్ష్మీనారాయణ, రాంచందర్‌రావు, ముక్క వెంక టేష్‌, రంగు మల్లేశం, గుర్రాల రాజేందర్‌రెడ్డి, గుర్నాథం మల్లారెడ్డి తదితరులు పాల్గొ న్నారు.