మహిళాసంఘాల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీ ఘటనను నిరసిస్తూ మహిళాసంఘాలు, విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌వరకు భారీ ర్యాలీ జరిగింది. మహిళలపై వేధింపులను ఆరికట్టాలని, మహిళలను వేధించేవారికి కఠినశిక్షలు విధించాలని విద్యార్థినీ, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ఎన్‌ఎఫ్‌ఐ, ఏఐఎన్‌ఎఫ్‌, ఐద్వా,డీఐవైఎఫ్‌, ఏఐవైఎఫ్‌. పీవోడబ్ల్యు తదితర సంఘాలకు చెందిన వారు పొల్గాన్నారు.